అతిగా హెడ్ ఫోన్స్ వాడుతున్నారా..? అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ ( Cellphone )వాడకం ఎక్కువ అయిపోయింది.మనం ఎక్కడికి వెళ్లినా మన వెంట సెల్ ఫోన్ ఉంటూనే ఉంటుంది.

అసలు ఫోన్ తో పాటు సెల్ఫోన్ కి సంబంధించి హెడ్ ఫోన్స్( Headphones ) ను కూడా మనం ఎల్లప్పుడూ మనతోపాటు అందుబాటులో పెట్టుకొని ఉంటాం.ఎందుకంటే సినిమాలు, మ్యూజిక్, ఫోన్ మాట్లాడడానికి ఇలా ఎన్నో ప్రతి దాని కోసం మనం హెడ్ ఫోన్స్ వాడుతున్నాము.

అయితే చాలామంది హెడ్ ఫోన్స్ వాడుతుంటారు.కానీ వాటి ద్వారా సులభంగా బ్యాక్టీరియా చెవిలోకి ప్రవేశిస్తుందన్న విషయాన్ని మాత్రం చాలా మంది తెలుసుకోలేరు.

అయితే హెడ్ ఫోన్స్ కి అంటుకునే దుమ్ము, ధూళి చెవిలోనికి ప్రవేశించి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తోంది.

Are You Using Headphones Too Much But Do You Know How Dangerous It Is , Cellphon
Advertisement
Are You Using Headphones Too Much But Do You Know How Dangerous It Is , Cellphon

అందుకే హెడ్ ఫోన్స్ తీసిన తర్వాత చెవిని ( Ear )శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.ఒకవేళ చెవిలో బ్యాక్టీరియా( Bacteria ) చేరితే ఇరిటేషన్ తో పాటు అసౌకర్యంగా ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది.ఇక చెవిలో ఏదో ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.

అయితే చెవిలో బ్యాక్టీరియా చేరిన తర్వాత చాలా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇలాంటి అనుభూతులు కలిగినప్పుడు కొంతవరకు హెడ్ ఫోన్స్ ను వాడడం మానేస్తుంటారు.

కానీ మరికొందరు నిర్లక్ష్యం చేసి హెడ్ ఫోన్స్ వాడకం చేస్తూ ఉంటారు.ఇక హెడ్ ఫోన్స్ తయారీ కూడా చెవి పరిశుభ్రత పై ప్రభావం చూపిస్తాయి.

Are You Using Headphones Too Much But Do You Know How Dangerous It Is , Cellphon

అయితే ప్లాస్టిక్ లేదా తోలు లాంటి కొన్ని పదార్థాలతో తయారు చేసిన మెటీరియల్ కారణంగా చెవి ఇన్ఫెక్షన్లకు( Ear infections ) గురయ్యే ప్రమాదం ఉంది.అలాగే హెడ్ ఫోన్లో ఎక్కువగా సేపు వాడటం అస్సలు మంచిది కాదు.ఒకవేళ వాడిన కూడా తక్కువ శబ్దంతో హెడ్ ఫోన్లను వాడాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

హెడ్ ఫోన్స్ అతిగా వాడటం వల్ల చెవిలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.దాంతో చెవి రంధ్రంలో బ్యాక్టీరియా చేరుకొని ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది.

Advertisement

అందువల్ల హెడ్ ఫోన్స్ వాడేవారు తరచుగా చెవులను శుభ్రం చేసుకోవడం, మంచి మెటీరియల్ తో తయారు చేసిన హెడ్ ఫోన్లను మాత్రమే వాడటం, తక్కువ సౌండ్ తో హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం లాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

తాజా వార్తలు