స్టైల్ గా ఉంటుంది కదా అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

చాలామంది స్టైల్ గా ఉంటుందని పెద్దల ముందే కాలి మీద కాలు వేసుకుని కూర్చుంటూ ఉంటారు.

అయితే చాలామంది అలా ఎక్కడ పడితే అక్కడ అలా కూర్చోకూడదని ముఖ్యంగా మహిళలను కాలి మీద కాలు వేసుకుని కూర్చోకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇప్పటికి కూడా చాలామంది ముసలి వారు ఎవరైనా ఆడవారు కాలి మీద కాలు( leg on leg ) వేసుకుని కూర్చుంటే అస్సలు ఊరుకోరు.ఇక మగవారి విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు.

ఇక పెద్దల ముందు చిన్న వారు కూర్చోకూడదని అంటారు.అయితే అసలు కాలి మీద కాలు వేసుకుని కూర్చోడం వలన చాలా ఆరోగ్య నష్టాలు కూడా ఉన్నాయని అమెరికా వైద్యులు నిర్ధారించారు.

అమెరికాకు( america ) చెందిన ఒక ప్రముఖ యూనివర్సిటీలో జరిగిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా చెబుతున్న దాని ప్రకారం కాలు మీద కాలు వేసుకోవడం వల్ల అది చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది.ఇక ప్రతి రోజు కూడా ఎక్కువ సమయం కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం వలన ఎన్నో అనార్థాలు ఎదురవుతాయని తాజాగా ఒక ప్రయోగం ద్వారా అమెరికన్ శాస్త్రవేత్తలు తెలిపారు.ముఖ్యంగా అమ్మాయిలు టైట్ డ్రెస్సులు వేసుకొని ఎక్కువగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వలన ఎముకల నొప్పులు లేదా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు.

Advertisement

ఇక 2017 సంవత్సరం నుండి ఈ పలువురు మోకాళ్ళ నొప్పుల రోగులను పరిశీలించిన తర్వాత డాక్టర్లు ఈ విషయాన్ని తెలిపారు.ఇక అంతేకాకుండా నడుము కింది భాగము రెండు కాళ్ళను కలుపుతూ పెల్విక్ అనే పెద్ద ఎముక ఉంటుంది.కాలి మీద కాలు వేసుకుంటే దానిపై ఒత్తిడి కలుగుతుంది.

అందుకే ఆ సమయంలో పెల్విక్ పై ప్రభావం పడుతుంది.దీంతో కాలి మీద కాలు వేసుకుని కూర్చోవడం అన్నది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

అందుకే కాలు మీద కాలు వేసుకోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు