కే‌సి‌ఆర్.. కాంగ్రెస్ ను ఫాలో అవుతున్నారా ?

ఈసారి తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ మరియు బి‌ఆర్‌ఎస్ పార్టీలకు డూ ఆర్ డై గా మారిపోయాయి.

రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బి‌ఆర్‌ఎస్.

ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ అంతర్లీనంగా దెబ్బ తినే అవకాశం ఉంది.అందుకే ఈసారి విజయాన్ని బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఎలాగైనా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి తెలంగాణ గడ్డ బి‌ఆర్‌ఎస్ అడ్డ అని మరోసారి నిరూపించాలని చూస్తున్నారు.అయితే ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఆయా సర్వేలు కూడా విజయం కాంగ్రెస్ ( Congress party )వైపే చూపిస్తున్నాయి.ఆ పార్టీ నేతలు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

Advertisement

దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పూర్తి మేనిఫెస్టోలో మరికొన్ని హామీలను కాంగ్రెస్ ప్రకటించింది.దీంతో బి‌ఆర్‌ఎస్ తో పోల్చితే ఎన్నికల హామీల విషయంలో కాంగ్రెస్ అక్క అడుగు ముందే ఉందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేలా కే‌సి‌ఆర్ మరిన్ని పథకాల ప్రకటనకు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటించినప్పటికి ఆ మేనిఫెస్టోకు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదు.ప్రస్తుతం అమలౌతున్న చాలా పథకాలనే మేనిఫెస్టోలో పొందుపరిచి వాటిలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశారు.ఫలితంగా బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టోపై ప్రజామద్దతు కొరత ఏర్పడింది.

అందుకే కాంగ్రెస్ మాదిరిగానే పూర్తిగా ప్రజల దృష్టి బి‌ఆర్‌ఎస్ వైపు మల్లెలా మరికొన్ని పథకాలను ప్రకటించేందుకు కే‌సి‌ఆర్ ( CM kcr )సిద్దమౌతున్నారట.ఈ నెల 25న హైదరబాద్ లో నిర్వహించబోయే సభలో కే‌సి‌ఆర్ కొత్త పాతకాలపై ప్రకటన చేసే అవకాశం ఉందట.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

మరి కే‌సి‌ఆర్ ప్రకటించబోయే ఆ కొత్త హామీలపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు