వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్

ఏపీ వైసీపీపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా పాతపాడులో ఐదవ వార్డుకు నామినేషన్ వేసిన బాబా సాహెబ్ పై వైసీపీ నేతల దాడి దుర్మార్గమని తెలిపారు.

నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని దాడి చేసి బెదిరించడం సరికాదని అచ్చెన్నాయుడు అన్నారు.ఈ క్రమంలో దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వార్డు సభ్యులను కూడా గెలుపించుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో దౌర్జన్యకాండను జగన్ కొనసాగిస్తున్నారని తెలిపారు.

జగన్ కు రాజకీయ సమాధి కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide