ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష షెడ్యూల్ ఏ రోజు.. ఏ పరీక్ష..పూర్తీ వివరాలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతులమీదుగా విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి.

పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.ఇంటర్ ఫస్టియర్ పరీక్షలలో 61 శాతం మంది, సెకండ్ ఇయర్ పరీక్షలలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )స్పష్టం చేశారు.

తాజాగా ఏపీలో ఇంటర్ సప్లమెంటరీ షెడ్యూల్ పరీక్ష విధానం రిలీజ్ చేయడం జరిగింది.మే 24న సెకండ్ లాంగ్వేజ్.మే25న ఇంగ్లిష్, మే 26న మ్యాథ్స్-A, బోటనీ, సివిక్స్.మే 27న మ్యాథ్స్-B, జువాలజీ, హిస్టరీ.

మే ఫిజిక్స్, ఎకనామిక్స్.మే 30న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్.

Advertisement

మే 31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, లాజిక్ పేపర్.జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ.

జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్.జూన్ 3న పర్యావరణ విద్య.

Advertisement