ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా ఆయన కేంద్ర పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం అయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకారంతో పాటు రిసోర్స్ గ్యాప్ కింద నిధులు మరియు విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరనున్నారని సమాచారం.

అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కూడా ఆమోదం తెలపాలని కోరనున్నారు.మోదీతో భేటీ అనంతరం సీఎం జగన్ సాయంత్రం 6 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement