ప్రచారంలో స్పీడ్ పెంచిన ఏపీ సీఎం జగన్..!!

ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.ఈ మేరకు పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రోజుకు మూడు చోట్ల సభలకు సీఎం జగన్ హాజరవుతున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం జగన్ ఇవాళ మరో మూడు ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

రేపల్లె, మాచర్ల ( Raypalle, Macherla )మరియు మచిలీపట్నంలో జగన్ పర్యటించి.వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగా సీఎం జగన్ రేపల్లెకు వెళ్లనున్నారు.అక్కడ సభలో పాల్గొననున్న ఆయన ఐదేళ్ల పాలనలో వైసీపీ( YCP ) ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు మాచర్లలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం జరగనుంది.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో నిర్వహించే సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ జోష్ కొనసాగనుండగా.సీఎం జగన్ కు ప్రజలు అడుగడుగున నీరాజనాలు పడుతున్నారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు