జగన్ కు ముచ్చెమటలు పట్టించబోతున్నమూడు పదవులు

రాజకీయ నాయకులకు పదవే ఒక అలంకారం.ఆ పదవుల కోసం కొంతమంది కష్ట నష్టాలు పడితే మరికొంతమంది మాత్రం సులువుగానే వాటిని పొందుతారు.

ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే ఏదో ఒక పదవి తమకు దక్కుతుందన్న ఆశతో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఆ విధంగానే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం గట్టి పోటీనే జరుగుతోంది.

ఇప్పటికే మంత్రి వర్గంలో జగన్ చాలామంది కొత్తవారికి చోటు కల్పించి సీనియర్ నాయకులకు ఝలక్ ఇచ్చాడు.అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుండడంతో చాలామంది తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం పార్టీలో పదవులు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటే పదవులు మాత్రం తక్కువగా ఉండడంతో చాలామంది ఇప్పటికే అసంతృప్తికి గురయ్యారు.

Advertisement

జగన్ మాత్రం ప్రాంతాల వారీగా, సామాజికవర్గాల వారీగా సమన్యాయం పాటించాలని జగన్ చూస్తున్నాడు.కానీ, ఆవావహుల సంఖ్య చాంతాండంత ఉండటంతో, అసంతృప్తి రేగే అవకాశముందని ఆలోచిస్తున్నాడు.ఇదే సమయంలో ఇప్పుడు ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మూడు స్థానాల్లో రెండు వైసీపీవి కాగా, ఒకటి టీడీపీది.గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నాని ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.విజయనగరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన కోలగట్ల వీరభద్ర స్వామి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు.

మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాం, చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు.ప్రస్తుతం వైసీపీకి వచ్చిన అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి చూస్తే ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయి.

అసలే అధికార పార్టీ కావడం, రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండటంతో చాలా మంది నాయకులు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవలని పట్టుదలగా ఉన్నారు.గత ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణకు, తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు జగన్.

Advertisement

ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయనకు ఒక సీటు గ్యారంటీ అని తెలుస్తోంది.అలాగే హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్‌కు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ చేస్తా అని జగన్ హామీ ఇచ్చారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి చేస్తా అని గతంలో హామీ ఇచ్చారు జగన్.ఆ విధంగానే కడప జిల్లా నుంచి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గత ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు.

ఆయనకి ఎమ్మెల్సీ హామీ వైసీపీ నుంచి ఉంది.ఇక ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు నాయకులు ఎమ్యెల్సీ పదవి దక్కతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఎవరికి వారు తమకు పదవి ఖాయం అనే ధీమాలో వైసీపీ కీలక నాయకుల దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

తాజా వార్తలు