నేను అంత దిగజారి పోలేదు - చంద్రబాబు

ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు సంబంధించి విపక్ష వైసీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కొట్టిపారేశారు.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిన్న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు.

ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తనకు లేదని, అయినా తనకు ఏ బలహీనతలు లేవని కూడా చంద్రబాబు తేల్చిచెప్పారు.‘‘నేను ఎవరినీ డబ్బులిచ్చి కొనడం లేదు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు.నాకు ఏ బలహీనతలు లేవు’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు