ప్రభుత్వ సంస్థలని హ్యాక్ చేయండి..షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు

కొత్త దానాన్ని అంది పుచ్చుకోవడంలో చంద్రబాబు ని మించిన వారు ఎవరూ లేరని చెప్పాలి.

చంద్రబాబు కి ఉన్న దూరదృష్టి, విషయపరిజ్ఞానం చంద్రబాబు ని ఇప్పటివరకూ తిరుగులేని నేతగా నిలబెట్టాయి.

సవాళ్ళని ఎదుర్కుంటూ ముందుకు వెళ్తేనే ఏదైనా సాధించగలం అని చెప్పే చంద్రబాబు ప్రతీ ఒక్కరు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం సిద్దంగా ఉండాలని తెలిపారు.మనిషి తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదని తెలిపారు

Ap Cm Chandrababu Naidu Open Challenge

ఇదిలాఉంటే ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో ఆంధ్రప్రదేశ్‌ సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్స్‌ సెంటర్‌ ప్రారంభించారు.ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే మార్గదర్శిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విధానం వలన గ్రామాలలో ఉండే పంచాయితీల నుంచీ అధికారిక కార్యాలయాల వరకూ కూడా సులభమైన పని విధానం జరుగుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.అదేంటంటే.రాజధానిలో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ థ్రెట్ అడ్వయిజరీ పోర్టల్‌ను ప్రారంభించిన ఆయన ఎథికల్ హ్యాకింగ్ చేసి నిరూపిస్తే భారీ నజరానా ఇస్తామన్నారు.

Advertisement
Ap Cm Chandrababu Naidu Open Challenge-ప్రభుత్వ సంస్థ

విద్యార్ధులకి సవాల్ విసిరారు.అయితే చంద్రబాబు తన తనయుడు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

మన ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు.ఐటీని ప్రమోట్‌ చేయడానికి సైబరాబాద్‌ను నిర్మించామన్నారు.

ఐటీ రంగంలో భారత్‌ దూసుకుపోతోందని చంద్రబాబు తెలిపారు.

తాజా వార్తలు