ఢిల్లీలో చంద్రబాబు ..  బిజీ బిజీ 

ఏపీలో టీడీపీ , జనసేన ,బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం చంద్రబాబు నాయుడు బిజీగానే గడుపుతున్నారు.

  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బాబు దానిపైనే పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు( Chandrababu naidu ) నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.  రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి.

  వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఢిల్లీకి వెళ్లి వచ్చారు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తోనూ భేటీ అయ్యారు .తాజాగా నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.చంద్రబాబు ఢిల్లీ టూర్ లో క్షణం తీరిక లేదన్నట్లుగా బిజీబిజీగా గడుపుతున్నారు.

  కొద్దిసేపటి కిందటే రాష్ట్రపతి భవన్ లోని కల్చరల్ సెంటర్ కు చంద్రబాబు చేరుకున్నారు.నీతి అయోగ్ సమావేశం ఇక్కడే జరుగుతున్న నేపథ్యంలో అక్కడకు చేరుకున్నారు

Ap Cm Chandrababu Delhi Tour Details, Jagan, Chandrababu Naidu, Cbn, Ysrcp, Ap C
Advertisement
AP CM Chandrababu Delhi Tour Details, Jagan, Chandrababu Naidu, CBN, Ysrcp, AP C

 ఈ నీతి అయోగ్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోది( Narendra Modi ) అధ్యక్షతన జరగనుంది .కల్చరల్ భవన్ కు చేరుకుంటున్న సమయంలో కారులోనే కొన్ని డాక్యుమెంట్లను చంద్రబాబు అధ్యయనం చేస్తూ కనిపించారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ , చంద్రబాబుతో పాటు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు నీతి అయోగ్ సమావేశానికి హాజరయ్యారు .ముఖ్యమంత్రులు భజన్ లాల్ శర్మ  రాజస్థాన్ ,హేమంత విశ్వ శర్మ అస్సాం,  భూపేంద్ర పటేల్ గుజరాత్ , నితీష్ కుమార్ బీహార్ , మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ , విష్ణుదేవ్ చత్తీస్గడ్ ఇందులో పాల్గొన్నారు నీతి అయోగ్ ను ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు.

Ap Cm Chandrababu Delhi Tour Details, Jagan, Chandrababu Naidu, Cbn, Ysrcp, Ap C

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మాత్రమే ఈ కూటమి నుంచి హాజరయ్యారు.ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ సమావేశానికి హాజరు కాలేదు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు , అలాగే ఏపీ వ్యాప్తంగా అమలు చేయబోతున్న అనేక సంక్షేమ పథకాల కు సంబంధించి నిధుల కేటాయింపు,  తదితర అంశాలపై కేంద్ర బిజెపి పెద్దలతో చర్చిస్తూ చంద్రబాబు మరింత బిజీగా మారిపోయారు.

Advertisement

తాజా వార్తలు