ఆధారాలు ఉంటే చూపు..పవన్ కి చంద్రబు సవాల్..

అసెంబ్లీ వ్యూహ కమిటి సభ్యులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై పైర్ అయ్యారు.

అంతేకాదు జనసేన అధినేత పవన కి సవాల్ కూడా విసిరారు.మోడీ పై పవన్ కళ్యాణ్ జగన్ లు ఈగ కూడా వాలనివ్వడం లేదు.

మొన్న పవన్ ఏమని మాట్లాడాడో నిన్న ఏమని మాట్లాడాడో అందరి తెలుసు ఏపీ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపి వైసీపి ,జనసేన మూడిటి అజెండా ఒక్కటే అంటూ మండి పడ్డారు.

తెదేపాపై బురద జల్లడమే సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాయన్నారు.అయితే వైసీపి జగన్ బహిరంగగానే మోడీతో కలిసిపోయారని అందుకు సాక్ష్యం పవన్ నాలుగు రోజులు నుంచి చేస్తున్న పనులేనని అన్నారు.

Advertisement

పోలవరం విషయంలో జగన్ మీడియాలో ఏవైతే విషయాలు వెల్లడించారో అవే ఇప్పుడు పవన్ చేస్తున్నారని అన్నారు.పోలవరంలో పూర్తీ స్థాయి పారదర్శకతతో జరుగుతున్నా సరే అవినీతి అవినీతి అంటూ మాట్లాడటం మంచిది కాదని అన్నారు చంద్రబాబు.

అవినీతి ఉందని పవన్ అంటున్నారు దమ్ము ఉంటే ఆ అవినీతి ఏంటో బయటపెట్టాలని అన్నారు.పవన్ ఎవరో ఆడించినట్టు ఆడుతున్నారని.

నిన్నటి వరకూ ఒక పరిణితి చెందినా వ్యక్తి పవన్ అనుకున్నాను కానీ సొంతగా అలోచినలేని వాడు అనుకోలేదు అని ఎద్దేవా చేశారు.మోడీ కి నాకు మధ్య ఉన్న విభేదాలు ఏంటో పవన్ చెప్పాలి.

నాకు అపాయింట్ మోడీ ఇవ్వనిది గొడవలు ఉన్న కారణం అన్నారు కదా ఆధారాలు ఉంటె బయట పెట్టండి అని చాలెంజ్ చేశారు.ఎప్పుడో ఏళ్ల క్రితం గోద్రా ఘటనలు జరిగినప్పటి సంగతి, ఇప్పుడు చెప్తున్నారని.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!

పవన్ ఇంతగా దిగజారి మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది.ఒక పార్టీ అధినేత ఇలాంటి విమర్శలు చెయ్యటం ఏంటని అన్నారు.

Advertisement

తెలుగులో టాప్ నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు చంద్రబాబు.అయితే పవన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడటం ఇదే మొదటి సారి.

తాజా వార్తలు