Narendra Modi Visakhapatnam : వైజాగ్‌లో మోడీ బహిరంగ సభను ఆపాలని ప్రయత్నిస్తున్న ఏపీ బీజేపీ!

నవంబర్ 12న విశాఖపట్నంలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తుంది.ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ రూ.

10,842 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల పనులను ప్రారంభించనున్నారు.ప్రాజెక్టుల వివరాలను చూస్తే: రైల్వే రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (రూ.460 కోట్లు), ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ (రూ.152 కోట్లు), షీలా నగర్ నుండి కాన్వెంట్ జంక్షన్ రోడ్డు విస్తరణ (రూ.566 కోట్లు), శ్రీకాకుళం నుండి అంగుల్ వరకు గెయిల్ పైప్‌లైన్ (రూ.2,658 కోట్లు), ఇచ్ఛాపురం-పర్లాకిమిడి మధ్య రోడ్డు విస్తరణ (రూ.211 కోట్లు), తూర్పు ఆఫ్‌షోర్‌లో ఒఎన్‌జిసి ఫీల్డ్‌ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (రూ.2,917 కోట్లు), విశాఖపట్నం-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎకనామిక్ కారిడార్‌లోని AP విభాగం (రూ.3,778 కోట్లు).ఇది అధికారిక పర్యటన కావడంతో స్థానిక బీజేపీ నాయకత్వానికి ఇందులో ఎలాంటి పాత్ర లేకుండా పోయింది.

ఇక జన సమీకరణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది.అందుకే దీన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.జనాలను సమీకరించే బాధ్యతను విశాఖపట్నం పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డికి బదులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డికి అప్పగించారు.

Ap Bjp Is Trying To Stop Modi Public Meeting In Vizag , Bjp , Vizag , Narendra M

ఇది వైఎస్సార్‌సీపీకి మైలేజీ తీసుకవస్తుందని భావించిన రాష్ట్ర బీజేపీ ఇబ్బందికర పరిస్థితిగా భావిస్తుంది.అలాగే జగన్ తన మూడు రాజధానుల ఎజెండాను ముందుకు తెచ్చి విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపతూ ఈ సభను అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడింది.విశాఖపై మోడీ ఏమైనా కమిట్ అయితే అమరావతికి మద్దతిస్తున్న రాష్ట్ర బీజేపీకి రాజకీయంగా నష్టంగా జరుగుతుందని భావిస్తుంది.

Advertisement
AP BJP Is Trying To Stop Modi Public Meeting In Vizag , BJP , Vizag , Narendra M

అందుకే, బహిరంగ సభను రద్దు చేయాలని, మోడీ కార్యక్రమాలను అధికారిక కార్యక్రమానికి పరిమితం చేయాలని బిజెపి నాయకత్వం న్యూఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.మోడీ బహిరంగ సభ వైఎస్ఆర్‌సిని కాషాయ పార్టీ జాతీయ నాయకత్వానికి మరింత చేరువ చేయగలదని, భవిష్యత్తులో బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకునే ప్రణాళికలపై ప్రభావం పడుతుందని తెలుగుదేశం పార్టీ కూడా అభిప్రాయపడింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు