న్యూస్ రౌండప్ టాప్ 20

1.డీజీపీ కి చంద్రబాబు లేఖ

 

టిడిపి మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డిజిపి కి చంద్రబాబు లేఖ రాశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారని ,వెంటనే నరేంద్రను విడుదల చేయాలని లేఖలో చంద్రబాబు కోరారు. 

2.టీఆర్ఎస్ నేతకు ఎన్నికల కమిషన్ నోటీసులు

  టిఆర్ఎస్ నేత మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరికి ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.దసరా రోజు స్థానిక హమాలీలకు రాజనాల శ్రీహరి మద్యం కోళ్లు పంపిణీ చేయడంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. 

3.విజయ సాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలి

 

అవినీతికి పాల్పడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కోవాలని, ఆయన పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ డిమాండ్ చేశారు. 

4.మునుగోడు ఓటర్ల జాబితా ప్రకటనపై హైకోర్టు విచారణ వాయిదా

  అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకటన దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ ను వాయిదా వేసింది. 

5.సాయికుమార్ దంపతులకు పురస్కారం

 

ప్రముఖ సాంస్కృతిక సంస్థ పద్మమోహన్ ఆర్ట్స్ 32 వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు సాయికుమార్ సురేఖ దంపతులకు విశిష్ట దంపతులకు శీర్షిక స్వర్ణఖం పురస్కారం ప్రదానం చేయనున్నట్లు సంస్థ అధ్యక్షుడు దేవల్లి యాదగిరి గౌడ్ తెలిపారు. 

6.ఏడుపాయల వనదుర్గ ఆలయం మూసివేత

  మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం మరోసారి మూత ఆలయం ముందు మంజీరా నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆలయాన్ని అధికారులు మూసివేశారు. 

7.15న ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు

 

Advertisement

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 15న ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. 

8.మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి టీటీడీపీ దూరం

  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీకి తెలంగాణ తెలుగుదేశం దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. 

9.వేములవాడ హుండీ ఆదాయం లెక్కింపు

 

వేములవాడ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు జరిగింది.కోటి 49 లక్షల రూపాయలకు పైగా ఆదాయం గత నెల ఒకటో తేదీ నుంచి 41 రోజుల్లో వచ్చింది. 

10.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్

  ఎన్నికలు వస్తేనే కెసిఆర్ కు పథకాలు గుర్తొస్తాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 

11.గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేయాలి

 

రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చైర్మన్ పదవిలో ఉండి మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపించాలంటూ గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పడం బాధాకరమని వెంటనే ఆయనను మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. 

12.తేట తెలుగు పుస్తకావిష్కరణ

  సిహెచ్ వెంకటేశ్వర్లు అని ఉపాధ్యాయుడు రాసిన తేట తెలుగు పుస్తకాన్ని రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ఆవిష్కరించారు. 

13.పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో పీసీసీ జారీ

 

తెలంగాణలోని ఆదిలాబాద్ యాదాద్రి భువనగిరి ఖమ్మం మహబూబ్నగర్ నల్గొండ వరంగల్ జిల్లా పోస్ట్ ఆఫీస్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పాస్ పోర్ట్ సేవా కేంద్రాల్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ ) జారిని ప్రారంభించినట్లు పోస్టల్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. 

14.ఓయూ ఇంజనీరింగ్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు

  ఓయూ ఇంజనీరింగ్ కళాశాల అందించే ఐదు యుజీ కోర్సులకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. 

15.ఋషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కామెంట్స్

 

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఋషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.ఋషికొండ తవ్వకాలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.ప్రభుత్వం ఏదో దాస్తుందంటూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. 

16.అనంతపురంలో భారీ వర్షాలపై జగన్ సమీక్ష

  అనంతపురంలో భారీ వర్షాలు అనంతర పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. 

17.మునుగోడు ఎన్నికలపై కేటీఆర్ కామెంట్స్

 

Advertisement

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, డబ్బు మధం ఉన్న ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

18.సిపిఐ నారాయణ కామెంట్స్

  నాన్ బిజెపి రాష్ట్రాల సీఎంలను సిపిఐ జాతీయ సభలకు ఆహ్వానిద్దామని భావించాం కానీ, దాన్ని విరమించుకున్నాం.కొందరు సీఎంలు ఇంకా ఊగిసలాడుతున్నారని, సిపిఐ జాతీయ సభలు ముగిశాక మరిన్ని సంప్రదింపులు జరిపి నాన్ బిజెపి సీఎంతో సమావేశం నిర్వహిస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 

19.ఏపీలో గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు

 

ఏపీలో గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

20.కొడాలి నాని పై బుద్ధ వెంకన్న కామెంట్స్

  మాజీ మంత్రి కొడాలి నాని పై టిడిపి నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.గుట్కా నానికి మతి భ్రమించిందని మండిపడ్డారు.

తాజా వార్తలు