బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన అనుష్క శర్మ... మరోసారి తల్లి కాబోతుందా అంటూ కామెంట్స్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి అనుష్క శర్మ ( Anushka Sharma ) ఒకరు.

ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె క్రికెటర్ విరాట్ కోహ్లీ( Virat Kholi ) ని ప్రేమించిన తర్వాత కొంతకాలం పాటు ఇద్దరు ప్రేమలో కొనసాగి అనంతరం వివాహం చేసుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత అనుష్క సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి అయితే ఈ దంపతులకు కూతురు జన్మించడంతో అనుష్క శర్మ పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు.ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె నిర్మాతగా మారి పలు సినిమాలు చేస్తున్నారు.

ఇక అనుష్క తన కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈమె గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.అనుష్క శర్మ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

అయితే ఈ విషయాన్ని అనుష్క శర్మ ఎక్కడ తెలియజేయలేదని చెప్పాలి.ఈమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తున్నా కూడా ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఈమె ప్రెగ్నెంట్ అంటూ అందరూ భావించారు.

Advertisement

ఇకపోతే తాజాగా అనుష్క శర్మ షేర్ చేసినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే కనుక తప్పకుండా ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం అందరికీ అర్థమవుతుంది.ఈ ఫోటోలో అనుష్క శర్మ బేబీ బంప్( Baby Bump ) కనిపించడంతో అందరూ కూడా ఈమె రెండోసారి తల్లి కాబోతుందని భావిస్తున్నారు.

మొబైల్ వన్ ప్రమోషన్ కోసం అనుష్క శర్మ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.ఈ పోస్ట్‌ కు సమయం చాలా వేగంగా పరిగెడుతోందని రాసుకొచ్చారు.ఆ ఫోటో చూసిన వెంటనే అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరి ఈమె ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు