టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అనుష్క శెట్టి( Anushka Shetty ) ఒకరు.
ఈమె సూపర్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకొని తెలుగు తమిళ భాష చిత్రాలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇక బాహుబలి( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన అనుష్క కొంతకాలం పాటు తన వ్యక్తిగత కారణాలవల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అనుష్క ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు.ఈమె తాజాగా ఘాటి( Ghaati ) అనే సినిమాలో నటిస్తున్నారు అయితే మొదటిసారి మలయాళ సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అనుష్క పెళ్ళి( Anushka Marriage ) కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్( Prabhas ) అనుష్క ఇద్దరు ప్రేమలో ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని గతంలో వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ ప్రభాస్ తను ఇద్దరు మంచి స్నేహితులమని చెప్పారు.ఇకపోతే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉండటంతో పెళ్లి చేసుకుంటున్నారని ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంటికి ఈమె కోడలుగా వెళ్లబోతుందంటూ తన పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు వినిపించి అయితే ఈ వార్తలపై అనుష్క స్పందించారు.నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నా నేను ఎప్పుడు బాధపడలేదు అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నా పెళ్లి పెళ్లి అంటున్నారు తప్ప ఎక్కడ, ఎవరితో జరిగిందో చెప్పడం లేదన్నారు.వివాహ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదన్నారు.అది నేరం కాదని.
అదొక భావోద్వేగంతో కూడిన విషయమని తెలిపారు.ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపేయండి ఆ టైం వస్తేనే ప్రతి ఒక్కరితోనూ ఈ విషయాన్ని చెబుతాను అంటూ అనుష్క చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy