''సలార్'' నుండి మరో ట్రైలర్.. వారం గ్యాప్ లోనే రాబోతోందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ సలార్.

ఈ సినిమా రిలీజ్ కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉంది.

క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

ఎన్నో రోజుల ఫ్యాన్స్ ఎదురు చూపులు మధ్య ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవ్వగా డిసెంబర్ మంత్ అలా స్టార్ట్ కాగానే ఇలా ప్రమోషన్స్ కూడా షురూ చేసారు.నిన్న సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.

ఈ ట్రైలర్ విషయంలో ఇప్పుడు మరొక వార్త నెట్టింట ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తుంది.సలార్ యూనిట్ నుండి మరో ట్రైలర్ రాబోతుంది అంటూ క్రేజీ టాక్ బయటకు వచ్చింది.ఈ ట్రైలర్ సినిమా రిలీజ్ అయ్యే వీక్ ముందు రిలీజ్ అయ్యే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

మొత్తానికి సెకండ్ ట్రైలర్ ఉంది అనగానే హైప్ మరింత పెరిగింది.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

మరి ఇదైనా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుందో లేదో చూడాలి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు