ఉప ఎన్నిక ముందు కేసీఆర్ కు మ‌రో టాస్క్... తిప్ప‌లు త‌ప్ప‌వా..?

మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలు ప్ర‌తిష్మాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో షాక్ లు త‌గులుతూనే ఉన్నాయి.

కాంగ్రెస్ లో కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి సైలెంట్ అవ‌డం.

ఇటు టీఆర్ఎస్ లో ఢిల్లీ నుంచి లిక్క‌ర్ స్కాం వ్య‌వ‌హారం ఇప్పుడు మైన‌స్ చేస్తుందనే అంటున్నారు.దీంతో రాజ‌కీయంగా కేసిఆర్ కు సెగ త‌గులుతోంద‌నే అంటున్నారు.

కీల‌కంగా భావిస్తున్న ఈ ఎన్నిక ముందు ముప్పేట దాడులు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు.ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నవారు ఇదే మాట చెబుతున్నారు.

అధికారం పార్టీ టీఆర్ఎస్ మునుగోడులో గెలిచి తీరాలని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.కానీ ఇప్పుడు ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావడం బీజేపీ నేతల నుంచి పదునైన విమర్శలు చేస్తున్నారు.

Advertisement
Another Task For KCR Before The By-election Is It Wrong To Flip, CM KCR, MLC Kav

దీంతో ప్ర‌తిష్మాత్మ‌క ఎన్నిక‌ముందు ఇబ్బందిగా మారుతోంది.

బీజేపీ డ్యామేజ్ చేసేలా ఉంది.

అయితే తాజాగా లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు రావడంతో రాష్ట్ర బీజేపీ తీవ్రస్థాయిలో స్పందించింది.హైదరాబాద్ లో కవిత ఇంటి ముట్టడికి నేతలు యత్నించారు.

ఈ సంఘటనలో పోలీసులు బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.

పోలీసుల తోపులాటలో బీజేపీ కార్యకర్తలు కొందరు స్పృహతప్పి పడిపోయారు.కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

దీంతో కవిత ఇంటి వద్దకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు.ఇక మరోవైపు కవిత రాజీనామాకు రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంద‌ని అంటున్నారు.

Advertisement

లిక్కర్ స్కామ్ లో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటున్న కవిత రాజీనామా చేసి విచారణకు సహకరించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కేటీఆర్ కవితపై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు.

కేసీఆర్ కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవితతో రాజీమానా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

న‌ష్టం త‌ప్ప‌దా.?

ఇవ‌న్నీ చూస్తుంటే మునుగోడు ఉప ఎన్నికపైనా ప్రభావం చూపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.ఈ సమయంలో బీజేపీ ఖచ్చితంగా లిక్కర్ స్కాంను మునుగోడు ప్రచారానికి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంద‌ని అంటున్నారు.

దీంతో టీఆర్ ఎస్ నేతలు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.అయితే మ‌రి కొద్ది రోజుల్లోనే కవితకు సీబీఐ నోటీసులు కూడా అందుతాయనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ కు మునుగోడులో న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజా వార్తలు