ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరొకరి అరెస్ట్..!

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా తాజాగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

మద్యం కుంభకోణం కేసులో ఇటీవల అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.కాగా ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశారు అధికారులు.