పిఠాపురంలో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం..!!

2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పవన్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు.

మొన్న జబర్దస్త్ టీం రాంప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శీను ప్రచారం చేయడం జరిగింది.ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఇదిలా ఉంటే బుధవారం మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) పిఠాపురంలో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Another Mega Hero Vaishnav Tej Is Campaigning In Pithapuram Details, Vaishnav Te

వచ్చే ఎన్నికలలో తన మామ పవన్ కళ్యాణ్ కి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఇదే సమయంలో పిఠాపురం పాదగయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వైష్ణవ్ తేజ్ తో పాటు గెటప్ శీను, సుడిగాలి సుదీర్ కొండేవర్మ్ నుండి ఉప్పాడ వరకు సాగిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది.

Advertisement
Another Mega Hero Vaishnav Tej Is Campaigning In Pithapuram Details, Vaishnav Te

నాగబాబు సతీమణి కొణిదల పద్మ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.ఈ రకంగా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పిఠాపురం చేరుకుంటున్నారు.2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దీంతో ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.

జుట్టు రాల‌కుండా ఒత్తుగా పెరగాలా? అయితే ఈ చిట్కా మీకే!
Advertisement

తాజా వార్తలు