ఏపీలో జ‌గ‌న్ మెడ‌కు మ‌రో భారీ స్కాం... అవినీతి కోట్ల‌లోనే ?

ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అవ‌గాహ‌న లేమితో పాటు వ్య‌వ‌స్థ‌ల‌తో పోరాటాలు చేస్తూ వ‌రుస‌గా ఏదో ఒక ఇబ్బందుల్లో చిక్కుకుంటూనే ఉంటోంది.

తాజాగా ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మెడ‌కు మ‌రో అవినీతి స్కాం చుట్టుకోనుంద‌న్న చ‌ర్చ‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఏపీలో విద్యుత్ కొనుగోళ్ల‌లో భారీ స్కాం జ‌రిగింద‌ని.ఇదంతా వైసీపీలో కీల‌క అధికారుల‌కు తెలిసే జ‌రిగింద‌ని అంటున్నారు.

గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన విద్యుత్ కుంభ‌కోణంలో అవినీతిని బ‌య‌ట‌కు తీస్తామ‌ని ఛాలెంజ్ చేసిన సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఇప్పుడు మ‌ళ్లీ అదే శాఖ‌లో భారీ అవినీతి జ‌రిగింద‌న్న వార్త‌లు రాజ‌కీయంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

Another Huge Scam For Jagan Mod In Ap ... Corruption In Crores,ap,ap Political N

ప్ర‌స్తుతం ఏపీలో క‌రెంటు వినియోగం పెరిగింది ప్ర‌భుత్వ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాల నుంచి వ‌చ్చే విద్యుత్ స‌రిపోక ఆ లోటు పూడ్చేందుకు ప్ర‌భుత్వాలు ప్రైవేటు సంస్థ‌ల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి.ఈ కొనుగోళ్ల‌లోనే గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని నాడు జ‌గ‌న్ ఆరోపించారు.అయితే ఇప్పుడు ఏకంగా ప్ర‌భుత్వ కేంద్రాల్లో ఉత్ప‌త్తి నిలిపేసి మ‌రీ ప్రైవేటులో విద్యుత్ కొంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Advertisement
Another Huge Scam For Jagan Mod In AP ... Corruption In Crores,ap,ap Political N

గ‌త యేడాది చివ‌ర్లో డిసెంబ‌ర్ తో పాటు జ‌న‌వ‌రి నెలల్లో ఏపీ ప్ర‌భుత్వం బ‌య‌ట నుంచే ఏకంగా రోజుకు 30 - 40 మిలియ‌న్ల యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసిందంటున్నారు.ఇది రాష్ట్రంలో వినియోగం అవుతోన్న విద్యుత్‌లో 20 శాతానికి స‌మానం.

గ‌తంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోళ్లు జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఒక్కో యూనిట్‌కే ఏకంగా మూడున్న‌ర నుంచి నాలుగు రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అన్న సందేహాలు ఉన్నాయి.

ఇక నిర్ణ‌యించిన ధ‌ర‌ల కంటే అధికం.ఈ తేడాను గుర్తించాకే విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి డిస్కంలకు నోటీసులు జారీ చేసింది.

ఈ తేడా కోట్ల‌లోనే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.గ‌తంలో ప్ర‌భుత్వం ఉత్ప‌త్తి చేసే ఖ‌ర్చు క‌న్నా బ‌య‌ట త‌క్కువ ధ‌ర‌కే విద్యుత్ దొరుకుతుంద‌ని చెపుతోన్న ప్ర‌భుత్వం ఇప్పుడు బ‌య‌ట అధిక ధ‌ర‌ల‌కు విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తోంద‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

మ‌రి దీనికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో ?  చూడాలి.

Advertisement

తాజా వార్తలు