జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి మరొకరు బలి..!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యానికి మరొకరు బలయ్యారు.సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి మృతి చెందింది.

పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు.ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి అదృశ్యమైంది.

ఈ క్రమంలోనే మ్యాన్ హోల్ మూత ఓపెన్ చేసి ఉండటంతో అందులో పడి మృత్యువాత పడింది.అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారించడంతోనే పాప ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న నగర మేయర్ విజయలక్ష్మీ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players