భారత్‎కు చేరుకున్న మరో 12 చీతాలు

దక్షిణాఫ్రికా నుంచి భారత్‎కు మరో 12 చిరుతలు చేరుకున్నాయి.

హిండన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ సీ-17 ఎయిర్ క్రాఫ్ట్ గ్వాలియర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

మొత్తం 12 చీతాల్లో 7 మగ, 5 ఆడ చీతాలు ఉన్నాయి.ఈ చిరుతలను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి భూపేంద్ర యాదవ్ లు కునో నేషనల్ పార్క్ లో విడుదల చేస్తారు.

అయితే, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చిరుత పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో బ్యాచ్ చీతాలు వచ్చాయి.ఈ మేరకు దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి చిరుతలు రవాణా చేయడానికి జనవరిలో అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

కాగా ఈ 12 చీతాలను నిబంధనల ప్రకారం నెల రోజులపాటు క్వారంటైన్ లో ఉంచనున్నారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide