NDSA : ఎన్డీఎస్ఏ ఆదేశాలతో తెరుచుకున్న అన్నారం బ్యారేజ్ గేట్లు..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజ్ గేట్లు( Annaram Barrage Gates ) తెరుచుకున్నాయి.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ( National Dam Safety Authority )ఆదేశాల మేరకు అధికారులు గేట్లను ఓపెన్ చేశారు.

ఈ మేరకు బ్యారేజ్ లోని పది గేట్లు ఎత్తి సుమారు 13 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.సరస్వతి బ్యారేజ్ నుంచి ఈ నీళ్లు మేడిగడ్డలోకి చేరనున్నాయి.

తరువాత మేడిగడ్డ గేట్లు ( Madigadda gates )ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదలనున్నారు.బ్యారేజ్ ఖాళీ చేసిన తరువాత ఎన్డీఎస్ఏ అధికారులు పరిశీలించనున్నారు.

కాగా వారం రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం తెలంగాణకు రానుంది.ఈ మేరకు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ను ఎన్డీఎస్ఏ పరిశీలించనుంది.

Advertisement

తాజా వార్తలు