నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి( Anil Ravipudi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో తెరకెక్కిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.ఇకపోతే ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను నమోదు చేసుకున్నారు అనిల్ రావిపూడి.

ఈ సినిమా అనిల్ రావిపూడి కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

Anil Ravipudi Direct Nagarjuna Hello Brother Sequel Details, Anil Ravipudi, Naga
Advertisement
Anil Ravipudi Direct Nagarjuna Hello Brother Sequel Details, Anil Ravipudi, Naga

ఇప్ప‌టికే 200 కోట్ల‌కుపై వ‌సూళ్ల‌ను సాధించి రికార్డు సృష్టించింది.ఇకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే డైరెక్ట‌ర్ గా సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ ల‌ను డైరెక్ట్ చేసారు.ఇక సీరియర్ హీరోల్లో బ్యాలెన్స్ ఉంది మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునే మాత్ర‌మే.

చిరంజీవితో( Chiranjeevi ) కూడా ప్రాజెక్ట్ ఒకే అయిన‌ట్లు తెలుస్తోంది.ఆ సినిమా ఇదే ఏడాది ప్ట‌ట్టాలెక్కనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

నాగార్జున‌తో( Nagarjuna ) సినిమా ఎప్పుడు ఉంటుంద‌నే సందేహాలు ఇప్ప‌టికే వ్య‌క్త‌ం అయ్యాయి.సీనియ‌ర్లు ముగ్గురితోనూ ప‌నిచేసి కింగ్ ని వ‌దిలేస్తారా? అన్న సందేహం వ్య‌క్త‌మైంది.ఈ నేప‌థ్యంలో నాగార్జున‌తో అనీల్ ఏకంగా హ‌లో బ్ర‌ద‌ర్( Hello Brother Movie ) లాంటి సినిమానే ప్లాన్ చేస్తున్న‌ట్లు తాజాగా అనీల్ రివీల్ చేసాడు.

Anil Ravipudi Direct Nagarjuna Hello Brother Sequel Details, Anil Ravipudi, Naga

కింగ్ తో చేస్తే అలాంటి సినిమా చేయాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టాడు.నాలుగు మూల స్థంబాలు లాంటి క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేసాన‌ని ఒక రికార్డు ఉంటుంది కాబ‌ట్టి ఏ హీరోని వ‌ద‌లను అని అన్నారు.నాగార్జున‌తో హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా అన‌గానే అక్కినేని అభిమానుల్లో ఒక్క‌సారిగా జోష్ తో నిండిపోయింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

నాగార్జున కెరీర్ లో హ‌లో బ్ర‌ద‌ర్ ఒక ఐకానిక్ చిత్రం అన్న విషయం తెలిసిందే.ఈ వీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభిన‌యంలో అల‌రించారు.

Advertisement

రాజ్ కోటి సంగీతం అందించి మ్యూజిక‌ల్ హిట్ గాను నిలిపారు.తాజాగా అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

తాజా వార్తలు