ఇక డిమాండ్లు కుదరవమ్మ ! టీడీపీ విజయం జనసేన కు నష్టం ?

2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టిడిపి , జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనతోనే ముందుకు వెళుతున్నాయి.

ఇటీవల మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలోను పవన్ ఒంటరిగా జనసేన ఎన్నికలకు వెళ్ళదు అనే విషయాన్ని చెప్పారు.

అయితే 20 స్థానాలు మాత్రమే టిడిపికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని , ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని తక్కువ స్థానాలకు  ఒప్పుకోను అన్నట్టుగా పవన్ మాట్లాడారు.దీంతో  టిడిపి అరకొర సీట్లతో జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే కుదరని అని టిడిపి ఫిక్స్ అయిపోయింది .ఖచ్చితంగా వైసీపీ( TDP )ని ఓడించాలంటే జనసేనకు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లనే కేటాయించాలని డిసైడ్ అయిపోయింది.ఒంటరిగా వెళితే 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయనే భయం టిడిపికి వచ్చింది.

అయితే తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో( Mlc elections ) టిడిపి సొంతంగా విజయం సాధించింది.ఈ ఎన్నికలకు జనసేన దూరంగా ఉన్నా.టీడీపీ కి మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించలేదు.>

ఈ విజయంతో టీడీపీలో ఎక్కడలేని ఉత్సాహం పెరిగింది.కేసులకు భయపడి యాక్టివ్ గా ఉండేందుకు భయపడిన నేతలంతా ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అయిన మరో పార్టీ అయినా చంద్రబాబు చెప్పినట్లుగానే వినాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది.

Advertisement

ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో వైసిపిని ఢీ కొట్టి విజయం దక్కించుకోవడంతో చంద్రబాబుదే పై చేయిగా మారింది.పొత్తుల విషయంలో చంద్రబాబు జనసేనకు 20 లేదా 30 సీట్లు  ఇచ్చినా, అవి ఎక్కడ ఇచ్చినా తీసుకోవాల్సిన పరిస్థితి జనసేన కు ఏర్పడుతుంది.పొత్తుల విషయంలోనూ,  రాజకీయంగా వైసిపి పైనా పై చేయి సాధించేందుకు ఇప్పుడు దక్కిన విజయం దోహద పడబోతోంది.

టిడిపి రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం ఆ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహాన్ని కలిగిస్తుండగా,  ఏపీ అధికార పార్టీ వైసిపి లో మాత్రం టిడిపికి దక్కిన విజయం నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు