బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ ( Rashmi ) ఒకరు.
కెరియర్ మొదట్లో ఈమె వెండి తెరపై పలు సినిమాలలో నటించినప్పటికీ వెండితెరపై అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదని చెప్పాలి.
ఇలా వెండి ధరపై సక్సెస్ సాధించినటువంటి రష్మీ బుల్లితెరపి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.అయితే బుల్లితెరపై ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమం తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.
అంతేకాకుండా ప్రతి పండుగకు ఏదో ఒక కొత్త ఈవెంట్ నిర్వహించగా అందుకు కూడా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ టీవీ వారు రశ్మి పెళ్లి పార్టీ ( Rashmi Pelli Party ) అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదల చేశారు.ఈ కార్యక్రమం డిసెంబర్ 31వ తేదీ ప్రసారం కానుంది.
ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది ( Aadi, ) చమ్మక్ చంద్ర ( Chandra ) వంటి వారు రశ్మిపై తమదైన స్టైల్ లో పంచ్ డైలాగులను వేశారు.హైపర్ ఆది వచ్చి రాగానే ఇదేంటి రష్మీ అని అనడంతో నా పెళ్లి పార్టీ ఆది అనే రష్మీ చెబుతుంది నీకు ఫార్టీ అంటే నమ్ముతాము కానీ పార్టీ అంటే ఎలా నమ్మాలి అంటూ ఆమె వయసు గురించి ప్రస్తావిస్తూ పంచ్ వేశారు.
అనంతరం చమ్మక్ చంద్రతో రష్మీ( Rashmi Chammak Chandra ) మాట్లాడుతూ మాకు మగవారు అంటే చాలా గౌరవం అని ఆమె తన కాళ్ళను నమస్కరిస్తూ మాట్లాడారు అనంతరం మగవాళ్ళు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టి ఆలిని చేసుకుంటారు తన పక్కలో పడుకోవడానికి చోటు కల్పిస్తారు ఏడాదికి చంకలో ఒక పిల్లని పెడతారు అంటూ మాట్లాడారు.దీంతో చమ్మక్ చంద్ర మీకు మగవాళ్ళు అంటే ఎంత గౌరవం అంటూ మాట్లాడుతారు.నాకు మగవాళ్ళు అంటే పిచ్చి ప్రాణం అంటూ ఈమె తనదైన స్టైల్ లో బోల్డ్ కామెంట్స్ చేశారు.
దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అనంతరం చీర కట్టుకున్నటువంటి రష్మీ తన కొంగును కప్పుకోవడంతో నిన్ను ఇంత పద్ధతిగా ఏ ఎపిసోడ్లోనూ చూడలేదు అంటూ చమ్మక్ చంద్ర మాట్లాడటంతో వెంటనే రష్మీ పేమెంట్ బట్టి పెర్ఫార్మెన్స్ ఉంటుంది అంటూ తనదైన స్టైల్ లో పంచ్ వేశారు దీంతో చమ్మక్ చంద్ర ఈ ఎపిసోడ్ కు భారీగానే పేమెంట్ వచ్చినట్టు ఉందిగా అంటూ కామెంట్ చేశారు.ఇలా వీరందరూ కూడా పెద్ద ఎత్తున పంచ్ డైలాగులతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేశారని తెలుస్తుంది.ఇక ఈ ఎపిసోడ్ డిసెంబర్ 31వ తేదీ ప్రసారం కానుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy