తెలుగు యాంకర్ పై అసభ్యకర ట్వీట్లు... తప్పేముందంటున్న అధికారులు.... 

మామూలుగా సెలబ్రిటీలపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తుంటారు.

ఇందులో భాగంగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా టాలీవుడ్ ప్రముఖ యాంకర్ పై అసభ్యకర ట్వీట్లు చేశాడు.

ఈ విషయం ప్రస్తుతం నేట్టింట్లో బాగానే వైరల్ అవుతుంది.తన అందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన అటువంటి అందాల యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు గురించి ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది.తాజాగా అనసూయ సోషల్ మీడియా సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.

ఇటీవల తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించినటువంటి సమస్యని మరవకముందే మరో సమస్యను ఎదుర్కొంటుంది.ఓ గుర్తి తెలియని వ్యక్తి తనపై అసభ్యకర ట్వీట్లు చేస్తున్నారని ఆరో పిస్తోంది ఈ అమ్మడు.

Advertisement
Anchor Anasuya Facing Social Media Problems-తెలుగు యాంకర�

అంతేగాక ఈ విషయమై ట్విట్టర్ అధికారులకు కూడా తెలియజేయగా వారు అనసూయ ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు కూడా చేశామని కాకపోతే అందులో తమకు అభ్యంతరకరంగా ఏమి కనిపించలేదని అన్నారు.దీంతో అనసూయ ట్విట్టర్ అధికారులపై మండిపడుతోంది.

Anchor Anasuya Facing Social Media Problems

అంతేగాక తాను ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని కచ్చితంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యక్తి పై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతానని అంటోంది ఈ అమ్మడు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ లో బిజీ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతోంది.చానల్ తో సంబంధం లేకుండా తెలుగు లోని దాదాపు అన్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానలల్లో పలురకాల షోలను నిర్వహిస్తోంది అనసూయ.

Advertisement

తాజా వార్తలు