మన్మధుడికి అనసూయ నుండి కూడా కష్టాలేనా?

నాగార్జున హీరోగా నటించిన మన్మధుడు 2 చిత్రం ఈనెల 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను సోలోగా తీసుకు వచ్చేందుకు నాగార్జున చాలా ప్రయత్నించాడు.

కాని ఈ చిత్రానికి పోటీ కాదు అంటూనే కథనం మరియు కొబ్బరిమట్ట చిత్రాలు విడుదల అవ్వబోతున్నాయి.అనసూయ హీరోయిన్‌గా నటించిన కథనం చిత్రం మన్మధుడు 2 చిత్రం విడుదలయ్యే రోజే విడుదల అవుతుంది.

నాగార్జునకు అనసూయ పోటీ అంటూ వార్తలు వచ్చిన సమయంలో అనసూయ స్పందిస్తూ వీరికి నేను పోటీ ఏంటీ పిచ్చి కాకపోతే అంటూ స్పందించింది.అసలు మన్మధుడు 2 చిత్రానికి తమ కథనం పోటీ కాదంటూ చెప్పిన అనసూయ తాజాగా ట్రైలర్‌తో అవాక్కయ్యేలా చేసింది.

ట్రైలర్‌ చాలా బాగా ఉంది.సినిమా ఏదో చిన్న చితకా సినిమా అన్నట్లుగా కాకుండా ఒక మంచి సినిమా, కంటెంట్‌ ఉన్న సినిమా అన్నట్లుగా అనిపిస్తుంది.

Advertisement

ఇప్పటికే కొబ్బరిమట్ట చిత్రం వల్ల ఏమైనా డ్యామేజ్‌ ఉంటుందా అని భావించిన మన్మధుడు 2 చిత్ర యూనిట్‌ సభ్యులకు ఇప్పుడు అనసూయ ఏమైనా డ్యామేజ్‌ చేస్తుందా అనే భయం పట్టుకుంది.ఎందుకంటే అనసూయ కథనం చిత్రం ట్రైలర్‌ అంత బాగుంది.ఆమె సినిమా తప్పకుండా చూడాలనే అభిప్రాయంలో కూడా ప్రేక్షకులు ఉన్నారు.

అందుకే ఈ చిత్రం వల్ల మన్మధుడు 2 చిత్రం ఓపెనింగ్స్‌ తగ్గే అవకాశం లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు