ఆ విషయంలో హీరో బాగా ఒత్తిడి చేశాడు... అనసూయ సంచలన వ్యాఖ్యలు!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో అనసూయ( Anasuya ) ఒకరు.

ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ క్రమక్రమంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమెకు రంగస్థలం సినిమా చాలా మంచి సక్సెస్ అందించింది ఈ సినిమా తర్వాత అనసూయ కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Anasuya Interesting Comments On Hero Adivi Sesh Details, Anasuya, Jabardasth, Ad

ఇలా వరుస అవకాశాలు వస్తున్న తరుణంలో ఈమె చివరికి జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకొని సినిమాల పైన ఫోకస్ పెట్టారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన మొదటి సినిమా క్షణం( Kshanam ) సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో అనసూయ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే చివరికి ఈమె విలన్ అని తెలిసి అందరూ కూడా షాక్ అవుతారు.ఈ సినిమాలో అనసూయ నటనకు మంచి మార్కులే వచ్చాయి.

Anasuya Interesting Comments On Hero Adivi Sesh Details, Anasuya, Jabardasth, Ad
Advertisement
Anasuya Interesting Comments On Hero Adivi Sesh Details, Anasuya, Jabardasth, Ad

తాజాగా ఈ సినిమాలో హీరో అడివి శేష్( Adivi Sesh ) గురించి ఈమె పలు విషయాలు వెల్లడించారు.నిజానికి తన ఫోర్ హెడ్ కనిపించేలా హెయిర్ స్టైల్ చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదట కానీ ఆ సినిమా సమయంలో అడవి శేషు మాత్రం తన ఫోర్ హెడ్ కనిపించేలా జుట్టు వేసుకోవాలని బాగా ఫోర్స్ చేశారు.ఇలా తను బలవంతం చేయడంతో తాను ఫోర్ హెడ్ కనిపించేలా హెయిర్ స్టైల్ చేసుకున్నాను.

అప్పటివరకు ఫోర్ హెడ్ చూపించడం కోసమే ఎంతో భయపడే నేను ఈ సినిమా తర్వాత ధైర్యంగా నా ఫోర్ హెడ్ చూపించగలుగుతున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు