నయనతార మూవీని రీమేక్ చేయబోతున్న జబర్దస్త్‌ యాంకర్‌?

జబర్దస్త్‌ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అయిన యాంకర్ అనసూయ( Anchor Anasuya ) వెండి తెరపై ఇప్పటికే తనదైన ముద్రను వేయడం జరిగింది.

ఆమె నుంచి ఇప్పటికే పలు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అంతే కాకుండా ఆమె కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యం లో భారీ ఎత్తున పారితోషికం ఇచ్చి ఆమెతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను( Lady Oriented Movies ) రూపొందించేందుకు గాను మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే అనసూయ త్వరలో ఒక భారీ పాన్ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేయబోతుందట.

మరో ముఖ్య విషయం ఏంటి అంటే తమిళం లో నయనతార హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ప్రముఖ రచయిత స్క్రిప్ట్ ను మార్చి అనసూయ తో చేయబోతున్నాడు అంటున్నారు.

మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.నయనతార( Nayanthara ) అక్కడ నటించి మెప్పించిన సినిమా ఏంటి, ఆ సినిమానే ఎందుకు అనసూయ చేసేందుకు రెడీ అయిందనే ప్రశ్నలకు త్వరలో సమాధానాలు లభించే అవకాశాలు ఉన్నాయి.విషయం పక్కన పెడితే నయనతార ప్లేస్ లో అనసూయ ఎంత వరకు సెట్‌ అవుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అనసూయ అభిమానులు మాత్రం నయన్‌ పాత్రను ఇక్కడ అనసూయ మాత్రమే పోషించగలదు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి త్వరలోనే ఓ మంచి సినిమా అనసూయ నుంచి వస్తుందని చాలా మంది విశ్వాసంగా ఉన్నారు.మరి ఎంత వరకు ఆ సినిమా వస్తుంది అనేది చూడాలి. జబర్దస్త్( Jabardasth ) ద్వారా వచ్చిన పాపులారిటీ తో నటిగా మంచి ఎంట్రీ దక్కించుకుంది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ఈమె కు ఇలాంటి ఒక ఆఫర్ రావడంతో ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది.

High Roller Tipps & Casino
Advertisement