హోలీ సెలబ్రేషన్స్ లో మునిగిపోయిన అనసూయ భరద్వాజ్.. నీకు కూడా అది తప్పలేదా అంటూ ట్రోల్స్?

నేడు హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు రంగులతో బాగా ఎంజాయ్ చేశారు.

సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు రంగులతో ఎంజాయ్ చేసిన సందర్భాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

అయితే తాజాగా యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ పండుగ ఘనంగా జరుపుకోగా దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఇప్పుడు నటిగా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.మొదట్లో టీవీలలో వార్తలు చెప్పిన ఈమె ఆ సమయంలో వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.

ఆ తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అడుగు పెట్టింది.

Advertisement

ఇక దీంతో ఈమె తలరాత మొత్తం మారిపోయింది.ఇక ఇక్కడి నుండి తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.తనేంటో అందరికీ అర్థం అయ్యేలా చేసింది.

ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించగా ఇక ఈ పాత్రతో ఈమెకు మరింత క్రేజ్ వచ్చింది.

దీంతో అప్పటినుంచి వరుసగా అవకాశాలు అందుకుంటూ వెనుకకు తిరిగి చూడకుండా బాగా దూసుకెళ్తుంది.ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న సినిమాలలో నటించింది.

ఇక ఈమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.సోషల్ మీడియా ద్వారా వాళ్లను అందరికీ పరిచయం చేసింది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో బాగా కాలక్షేపం చేస్తూ ఉంటుంది.ఇక ఈ వయసులో కూడా ఈమె చాలా అందంగా ఉండటమే కాకుండా బాగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.

Advertisement

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తుంది.ఇక అనసూయ అంటే అందరూ అదృష్టంగా భావిస్తూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా ఆహ్వానిస్తూ ఉంటారు.నిజానికి ఈమె అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో నేడు హోలీ పండుగ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో రంగులు చల్లుకుంటూ కనిపించింది.

ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా అందులో తను చాలా ఎంజాయ్ చేసినట్లు కనిపించింది.ఇక ఆ ఫోటోలు చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

అంతేకాకుండా హ్యాపీ ఉమెన్స్ డే అంటూ అనసూయకు విష్ కూడా చేస్తున్నారు.అయితే ఇదంతా పక్కన పెడితే ఓ నెటిజన్.

సెలబ్రిటీ అయిన హోలీకి పాత బట్టలు వేసుకోవాల్సిందే అంటూ కామెంట్ చేశారు.దీంతో ఆ కామెంట్ చూసి ఇతర నెటిజన్స్ అవును నిజమే అంటూ తెగ నవ్వుకుంటున్నారు.

అయితే అనసూయ కూడా పాత బట్టలు వేసుకోవడంతో అందరూ ఇలా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు