Bakhita : 19 ఏళ్ళ తరువాత ప్రత్యక్షమైన ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పటి బాల నటులు, ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా మారడం కొత్తేమి కాదు.నిజానికి చెప్పుకోవాలంటే మన స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులు కూడా, బాల నటులుగా కెరీర్ మొదలు పెట్టినవారే.

15, 20 ఏళ్ళ క్రితం బాల నటులుగా తెర పై మెరిసిన చిచ్చర పిడుగులు ఇప్పుడు పెద్దవారైపోయారు.బాల నటులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తేజ సజ్జ, ఆనంద్ వర్ధన్ వంటి వారు ఇప్పుడు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, బాల నటిగా ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ మాత్రం తనకు సినిమాలలో నటించడం ఇష్టం లేదని ఖరాఖండి గా చెప్పేస్తోంది.ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా? ఐతే ఇది చూడండి.

తెలుగు పరిశ్రమలో మోస్ట్ సెన్సిబిల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల( Director Shekhar Kammula ).ఆయన తీసిన సినిమాలన్నీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేస్తాయి.కుర్రకారుని ఆలోచింపజేసే హ్యాపీ డేస్ నుంచి, యావత్ రాష్ట్రాన్ని ఆలోచనలో పడేసిన లీడర్ వరకు, ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులకు సందేశాన్ని ఇచ్చే చిత్రాలే.

Advertisement

వీటితో పాటు మధ్య మధ్యలో ఆనంద్, ఫిదా వంటి మంచి కాఫీ లాంటి లవ్ స్టోరీలతో కూడా అలరిస్తారు శేఖర్ కమ్ముల.రాజా హీరోగా, కమిలిని ముఖర్జీ హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం "ఆనంద్".

ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది.ఈ సినిమాలో నటించిన వారందరిని పక్కన పెడితే, "సమత" పాత్రలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ప్రత్యేకం.

ఆమె పేరు "బఖిత ఫ్రాన్సిస్". ( Bakhita Francis ) ఈ చిత్రంలో నటనకు గాను ఆమె ఉత్తమ బాల నటి విభాగంలో నంది అవార్డు అందుకుంది.

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఈ చిత్రం తరువాత బఖిత మళ్ళి నటించలేదు.ఆమె ప్రస్తుతం ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఇప్పుడు చూదాం.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
High Roller Tipps & Casino

బఖిత ఫ్రాన్సిస్ 2004 లో వచ్చిన ఆనంద్ చిత్రం తరువాత మళ్ళి నటించలేదు.ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడినట్టు సమాచారం.నటి అవ్వాలనే కోరిక లేకపోయినా, కేవలం శేఖర్ కమ్ముల కోసమే ఆ చిత్రంలో నటించ అని అంటుంది బఖిత.

Advertisement

ఈమె వయసు 26 ఏళ్ళు.ప్రస్తుతం సమాజ సేవలో బిజీ గా ఉంది.

సమాజంలో స్త్రీల హక్కుల కోసం పోరాడుతుంది.అమ్మాయిల పై దాడులు ఆగాలని, అత్యాచారాలు చేసే వారికీ కఠిన శిక్షలు వెయ్యాలని పోరాటం చేస్తోంది.

బఖిత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.తరచూ ఆమె సోషల్ మీడియా లో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ ఫోటోలను చూసి, కొందరు మళ్ళి సినిమాలలో నటించవచ్చు కదా అని అడిగితే, తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పిందట బఖిత ఫ్రాన్సిస్.

తాజా వార్తలు