'బేబీ' 4 రోజుల కలెక్షన్స్.. సునామీ సృష్టిస్తుందిగా..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ( Anand Devarakondam ) విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతున్న ఈయనకు బ్రేక్ రాలేదు అనే చెప్పాలి.

గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు కానీ హీరోగా ఎదగలేక పోయాడు.

అయితే తాజాగా ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు.

Anand Devarakonda Baby Movie 4 Days Collections, Anand Devarakonda, Baby Movie

ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.ఈ సినిమా 4 రోజుల్లో భారీ కలెక్షన్స్ రాబట్టింది.ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) హీరోయిన్ గా నటించిన బేబీ మూవీ ( Baby Movie )యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.

ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం హీరోయిన్ బోల్డ్ రోల్ కావడంతో ఈ సినిమా కుర్రాళ్లకు మరింతగా నచ్చేసింది.ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.

Advertisement
Anand Devarakonda Baby Movie 4 Days Collections, Anand Devarakonda, Baby Movie

జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.ఇక మొదటి షో నుండే మంచి టాక్ అందుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా రాబట్టింది.

ఇక ఓపెనింగ్స్ కంటే ఆ తర్వాత భారీగా వసూళ్లు సాధిస్తుంది.

Anand Devarakonda Baby Movie 4 Days Collections, Anand Devarakonda, Baby Movie

ఇక 4వ రోజు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమా మొదటి రోజు 7 కోట్ల పైగానే కలెక్షన్స్ రాబట్టింది.ఇక రెండవ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా 7 కోట్లకు పైగానే రాబట్టింది.

ఇక నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.మరీ ముఖ్యంగా సోమవారం రోజు ఈ సినిమా మొదటి రోజు కంటే ఎక్కువగా రాబట్టింది.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కాగా ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ వారు నిర్మించగా.విజయ్ బుల్గానిస్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు