మంత్రి పదవి ఇవ్వలేదని ఆనం బాధ... నేదురు మల్లి కీలక వ్యాఖ్యలు

ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వైసీపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు.

అందుకే అధిష్టానం ఆయనను పక్కన పెట్టిందని తెలిపారు.

ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.వెంకటగిరిలో ఆనం అక్రమాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అవసరమైతే జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు.తవ్వే కొద్దీ ఆనం అవినీతి బయటపడుతోందన్న నేదురు మల్లి ఆనం అక్రమాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి కమిటీతో విచారణ చేయిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు