అనాథ పిల్లలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న పవన్ సతీమణి.. మంచి మనస్సంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ( Anna lezinova )గురించి మనందరికీ తెలిసిందే.

తాజాగా ఈమె చేసిన పనికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్నా లెజినోవా అనాధ ఆశ్రమాలను సందర్శించారు.అంతేకాకుండా వారితో కలిపి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడంతో పాటు వారికి మంచి మంచి బహుమతులు కూడా అందించింది.

తాజాగా హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ లోని చిన్నారుల స‌మ‌క్షంలో క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను( Christmas celebrations ) జ‌రుపుకున్నారు.

తన విలువైన స‌మ‌యాన్ని వెచ్చించి అన్నా చాలాసేపు పిల్ల‌ల‌తో ముచ్చటించి వారి విద్యాబుద్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఆనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు.నిత్యావసర సరుకులను కూడా అందచేశారు.

Advertisement

పిల్ల‌లంతా ఈ పండ‌గ వేళ‌ అన్నా లెజినోవాతో క‌లిసి ఎంతో సంతోషంగా క‌నిపించారు.తర్వాత అన్నా లెజినోవాని ఆ హోమ్ వారు నిర్వాహకులు సత్కరించారు.

ఒకవైపు పవన్ కళ్యాణ్ అడిగిన వారికి లేదనుకుండా సహాయం చేస్తూ తన గొప్ప మనసను చాటుకుంటున్నారు.

అయితే తాజాగా అన్నా లెజినోవా( Anna lezinova ) చేసిన మంచి పనిని అభిమానులు నెట్టిజెన్స్ మెచ్చుకుంటూ చాలా మంచి మనసు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు సినిమాల్లో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలపై పూర్తిగా దృష్టిని సారించి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు