ఎన్నికలకు ముందు హుజూరాబాద్ లో ఆసక్తికర ఘటన

సాధారణంగా ఎవరైనా నేత పార్టీ మారినప్పుడు పార్టీ కండువా మారటం.ఎన్నికల గుర్తు మారటం సహాజం.

కానీ ఇక్కడ నేత పార్టీ మారడమే ఆలస్యం కార్యాలయం రంగు కూడా మారిపోయింది.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

నియోజకవర్గానికి చెందిన వొడితల ప్రణవ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇప్పటివరకు హుజూరాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయంగా ఉన్న తన సొంత భవనానికి కాంగ్రెస్ పార్టీ రంగులు వేయించారు.దీంతో మొన్నటివరకు హుజూరాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా ఉన్న ఆ భవనం కాస్తా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిపోయింది.

Advertisement

మరోవైపు ఎన్నికల సమయంలో పార్టీకి కార్యాలయం లేకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement

తాజా వార్తలు