అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. హైదరాబాద్ లో ఢిల్లీ పోలీసుల మకాం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah )వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల( Delhi Police ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

ఈ మేరకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు.

నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్ లోనే ఉందని తెలుస్తోంది.తాజాగా ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కు రానున్నారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అరెస్ట్ అయిన ఐదుగురిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ వీడియోకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ లను సీజ్ చేశారు.

Validation Check 2026
Advertisement