అమిత్ షా ఫెయిల్యూర్ అస్త్రం.. ఫలిస్తుందా ?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంతో పోల్చితే ప్రస్తుతం పార్టీ బలం మెరుగ్గా ఉండడం, కే‌సి‌ఆర్ సర్కార్ పై కూడా అడపాదడపా వ్యతిరేకత ఎదురవుతుండడంతో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని కమలనాథులు అస్త్రశాస్త్రాలు సిద్దం చేసుకుంటున్నారు.

బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.నెలలో ఒకరిద్దరు బీజేపీ పెద్దలు రాష్ట్రనికి వస్తూ నేతల్లో జోష్ నింపుతున్నారు.

కాగా అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు ఎంతటి రిస్క్ అయిన చేయడానికి సిద్దం గా ఉంటారు.

ఎవరు ఊహించని ప్రణాళికలు సిద్దం చేసుకుంటూ పోలిటికల్ హిట్ పెంచుతుంటారు.తాజాగా తెలంగాణలో కూడా ఎవరు ఊహించని వ్యూహాన్ని కాషాయ పార్టీ అమలు చేయాలని చూస్తుండడమే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.ఇటీవల తెలంగాణకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు( Muslims reservation ) చేస్తామని ప్రకరించారు.

Advertisement

దీంతో ఒక్కసారిగా అగ్గి రాజుకుంది.అమిత్ షా ( Amit Shah )చేసిన ఈ ప్రకటనపై మైనారిటీ సంస్థల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది.మత ప్రాతిపాధికన ఓట్లను చీల్చి రాజకీయ లబ్ది పొందేందుకే బీజేపీ ప్లాన్ అని తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు కొందరు.

అయితే ఇదే వ్యూహాన్ని బీజేపీ కర్నాటకలో కూడా అమలు చేసింది.

కర్నాటకలో ముస్లింలకు( karnataka ) అమలౌతున్న 4 శాతం రిజర్వేషన్స్ ను రద్దు చేసి.లింగాయత్, వక్కలిగాలకు రెండేసి శాతం కేటాయించారు.దీంతో అక్కడి మైనార్టీ సంఘాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.

అయితే మతపరమైన రిజర్వేషన్స్ రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కావని బీజేపీ పెద్దలు చెబుతున్న మాట.అయితే కర్నాటకలో ఈ ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నా మాట.ఇప్పటికే బీజేపీపై ఉన్న వ్యతిరేకత కారణంగా సర్వేలన్ని కూడా బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి.అయినప్పటికి ఆ నిర్ణయంపై ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు బీజేపీ.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆచరిస్తూ తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తామని అమిత్ షా చెప్పడం నిజంగా సాహసమే.ఎందుకటే తెలంగాణలో మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ.దాంతో వారంతా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది.

Advertisement

మరి బీజేపీ ప్రయోగిస్తున్న ఈ మతపరమైన అస్త్రం ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

తాజా వార్తలు