నైగర్‌లో మోహరించిన అమెరికా, ఫ్రాన్స్ దళాలు.. అక్కడేం జరుగుతుందంటే

నైగర్( Niger ) అని పిలువబడే ముఖ్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశం గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అధ్యక్షుడిగా ఉన్న బజౌమ్‌ను( Bazoum ) ఆర్మీ ప్రెసిడెన్షియల్ చీఫ్ గార్డ్ జనరల్ అబ్దురహ్మనే ఒమర్ ట్చియాని( Abdourahamane Tchiani ) గద్దె దించారు.

ఒకప్పుడు ఆఫ్రికన్ ఖండంలోని యుద్ధ-బాదిత దేశాలలో శాంతి పరిరక్షక ప్రయత్నాలలో పాల్గొన్న జనరల్ అబ్దురహ్మనే ఒమర్ ట్చియాని ఇప్పుడు నైజర్‌లో పెద్ద సంక్షోభాన్ని సృష్టించారు.గతంలో ఈ దేశాన్ని పాలించిన మొహ్మద్ బజూజ్ ఫ్రాన్స్‌కు మిత్రదేశంగా కొనసాగారు.

దీంతో అతడికి మద్దతుగా ఫ్రాన్స్, మరో వైపు అమెరికా దళాలు ఆ దేశంలో మోహరించాయి.

దీంతో తిరుగుబాటు చేసిన సైనిక పాలకుడు అబ్దురహ్మనే ఒమర్ ట్చియాని ప్రస్తుతం రష్యాను( Russia ) ఆశ్రయించారు.ఆయనకు పుతిన్( Putin ) రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు.దీంతో రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్( Wagner Group ) ప్రస్తుతం అబ్దురహ్మనే ఒమర్ ట్చియాని తరుపున పోరాడుతోంది.

Advertisement

నైగర్ అనేది వాయువ్య దిశలో అల్జీరియా, ఈశాన్యంలో లిబియా, తూర్పున చాద్, దక్షిణాన నైజీరియా మరియు బెనిన్ మరియు పశ్చిమాన బుర్కినా ఫాసో, మాలిచే చుట్టు ఉన్న ఒక దేశం.ఈ దేశాలలో ఖనిజాలు, యురేనియం, చమురు, బంగారు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి,

వీటిని ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్( Economic Community Of West African States ) అనే సాధారణ పశ్చిమ ఆఫ్రికా ఆర్థిక వేదిక సహాయంతో ఫ్రాన్స్( France ) సులభంగా దోచుకుంటుంది.ప్రస్తుతం సైనిక తిరుగుబాటు రావడంతో వారి ఆటలు సాగడం లేదు.దీంతో సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు అమెరికా, ఫ్రాన్స్ దళాలు సిద్ధం అవుతున్నాయి.

దీనికి కారణం ఆ దేశంలోని విలువైన ప్రకృతి సంపద కోసమేనని వాదనలున్నాయి.మరో వైపు సైనిక తిరుగుబాటు లేవనెత్తిన ఆర్మీ ప్రెసిడెన్షియల్ చీఫ్ గార్డ్ జనరల్ అబ్దురహ్మనే ఒమర్ ట్చియాని వారిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ ఘర్షణల వల్ల ఆ దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు