అమెరికాలో విషాదం : చెరువులో మునిగి భారతీయ విద్యార్ధి దుర్మరణం

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.చెరువులో మునిగి ఓ భారతీయ విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.కేరళకు చెందిన క్లింటెన్ అజిత్ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రానికి వెళ్లాడు.

ఈ క్రమంలో గత శుక్రవారం తరగతులు ముగిసిన తర్వాత స్నేహితులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.అయితే ఈ సమయంలో బాల్ .అక్కడికి దగ్గరలో వున్న చెరువులో పడింది.దానిని తీసుకొచ్చేందుకు అజిత్ చెరువులో దిగాడు.

ఈ సమయంలో ఒక్కసారిగా కాలు జారీ నీటిలో మునిగిపోతూ కేకలు వేశాడు.దీనిని గమనించిన అతని మిత్రులు చెరువు దగ్గరకు వెళ్లి సాయం కోసం అరిచారు.

Advertisement

కానీ అప్పటికే ఆలస్యం కావడంతో అజిత్ నీటిలో గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నారు.

దాదాపు మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విద్యార్ధి మృతదేహాన్ని బయటకు తీశారు.అజిత్ మరణవార్తను స్నేహితులు కేరళలోని అతని తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఉన్నత చదువులు చదివి ఇంటికి వస్తాడనుకున్న కొడుకు.కానరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అజిత్ మృతదేహాన్ని భారతదేశానికి పంపేందుకు అక్కడి ప్రవాసీ సంస్థలు, అధికారులు చర్యలు చేపట్టారు.కాగా.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ఇదే ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో సమీపంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.

Advertisement

ఈ ప్రమాదంలో పీచెట్టి వంశీకృష్ణ (23), అతని స్నేహితుడు పవన్‌ స్వర్ణ (23), కారును నడుపుతోన్న మహిళా డ్రైవర్ మేరీ ఎ.మెయునియర్ (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.అదే కారులో వారితో పాటు ప్రయాణిస్తున్న డి.కల్యాణ్‌, కె.కార్తీక్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటానాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

వీరిలో కార్తీక్ పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు