నిమ్మలో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

చాలా మంది నిమ్మకాయను వంటల్లో వాడటానికి మరియు నిల్వ పచ్చడి పెట్టటానికి వాడుతూ ఉంటారు.అయితే నిమ్మను ప్రతి రోజు ఔషధంగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజు నిమ్మ తీసుకోవటం వలన రక్త ప్రసరణ బాగా సాగి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం,తేనే కలిపి తీసుకుంటే దగ్గు,జలుబు,జ్వరం వంటివి తొందరగా తగ్గిపోతాయి.నిమ్మపండులో బి.సి.విటమిన్లు సమృద్ధిగా ఉండుట వలన బాక్టీరియాకు, ఫంగల్‌ ఇన్పెక్షన్స్‌కు వ్యతిరేకంగా పోరాడే రోగనిరోదక శక్తి ని శరీరానికి అందిస్తుంది.నిమ్మలో పోటాషియం తగినంత మోతాదులో ఉండటం వలన గుండెకు సంబంధించిన బాధలు, వ్యాధులను పోగొడుతుంది.

కడుపులో మంటతో బాధపడేవారు రాత్రి పడుకోనే మందు నిమ్మరసం తాగినట్లుయితే ఆ బాధ మటుమాయమౌతుంది.నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన దంతక్షయం, చిగుళ్ళవాపు, పుప్పిపళ్శు, ఇంకా చిగుళ్ళకు సంబంధించిన ఏవ్యాధినైనా తగ్గిస్తుంది.

Advertisement

అరికాళ్ళ మంటలతోబాధపడేవారు నిమ్మ కాయ చెక్కతో కాళ్ళను బాగా రుద్దినట్లయితే అరికాళ్ళ మంట నుండి ఉపశమనం కలుగుతుంది.ప్రేగులలో వుండే సూక్ష్మక్రిములను నిమ్మ నశింపచేస్తుంది.కాబట్టి గ్యాస్‌ సమస్య ఉన్నప్పుడు నిమ్మరసాన్ని తీసుకుంటే గ్యాస్ ని బయటకు పంపి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి దోహదపడుతుంది.

ఈ విధంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు నిమ్మ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.కాబట్టి ప్రతి రోజు వీలును బట్టి నిమ్మరసంను తీసుకోండి.

Advertisement

తాజా వార్తలు