ఖర్జూరంలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ఖర్జూరంలో విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉండటం వలన శరీరం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇది కంటి చూపు మరియు రేచీకటిని మెరుగుపరచటానికి బాగా సహాయపడుతుంది.

ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఖర్జూరాన్ని మన ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు.

1.కొలెస్ట్రాల్ మరియు కొవ్వు

ఖర్జూరంలో కొలెస్ట్రాల్ మరియు కొవ్వు ఉండవు.అందువల్ల దీనిని కొవ్వు ఆహారాలకు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకోవచ్చు.వీటిని తీసుకుంటే కేలరీలతో సమానంగా పొషణను అందిస్తుంది.

2.ప్రోటీన్లు

శరీరానికి అవసరం అయినప్పుడు తక్షణమే ప్రోటీన్లను అందించటంలో ఖర్జూరం సహాయపడుతుంది.దీనిలో కండరాల నిర్మాణానికి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.శరీరం యొక్క రోజు వారి కార్యకలాపాలకు అవసరం అయిన ప్రోటీన్ ని ఖర్జూరం పుష్కలంగా అందిస్తుంది.

3.విటమిన్స్

ఖర్జూరంలో అన్ని రకాల విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి.దీనిలో విటమిన్ A1,విటమిన్స్ B1, B2, B3 మరియు B5, విటమిన్ C ఉంటాయి.అందువల్ల ఖర్జూరాన్ని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్స్ అన్ని సులభంగా అందుతాయి.

4.శక్తి

ఖర్జూరంలో సహజమైన చక్కెరలు ఉండుట వలన తిన్నా వెంటనే శరీరానికి శక్తి వచ్చేస్తుంది.దాంతో ఇది అనారోగ్య అల్పాహారం లేదా అధిక క్యాలరీల భోజనం యొక్క అవసరాన్ని తొలగిస్తుంది.

5.పొటాషియం మరియు సోడియం

ఖర్జూరంలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉండుట వలన, వీటి కాంబినేషన్ ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు బాగా సహాయపడుతుంది.

ఖర్జూరంలో ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాక స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

Amazing Benefits Of Dates-Amazing Benefits Of Dates-Telugu Health - తెలు
బహిరంగంగా కొట్టుకున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్.. సర్ధిచెప్పిన మాజీ టీమిండియా బౌలర్

తాజా వార్తలు