రేపే మౌని అమావాస్య.. పొరపాటున ఈ పనులు చెయ్యకండి?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమిలు రావడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే ఈ పౌర్ణమి అమావాస్యలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా అమావాస్యరోజు ఇంట్లోవారు పితృదేవతలను స్మరించుకుని వారికి పిండ ప్రదానాలు చేయడం మనం చూస్తుంటాము.ఇలా అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారని వారికోసం దేవుడి దగ్గర నైవేద్యం ఉంచి అనంతరం ఆ ఆహారాన్ని కాకులకు ప్రదానం చేయాలని చెబుతారు.

ఇకపోతే ఫిబ్రవరి 1వ తేదీ అమావాస్య రావడంతో ఈ అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్య అని పిలుస్తారు.ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతుంటారు.

మరి అమావాస్య రోజు ఏ విధమైనటువంటి పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.అమావాస్య రోజు వేకువ జామున నిద్ర లేవాలి అలాకాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు.

Advertisement
Amavasya Day For-avoid This Works What Amavasya, Avoid Works, Sleep, Hair Cut, N

అమావాస్య రోజు పొరపాటున కూడా కొత్త బట్టలను ధరించకూడదు.అదేవిధంగా గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులను చేయకూడదు.

Amavasya Day For-avoid This Works What Amavasya, Avoid Works, Sleep, Hair Cut, N

ఇక అమావాస్య రోజు సాయంత్రం 5 నుంచి ఇంట్లో తలదువ్వడం తలకు నూనె పెట్టడం వంటి పనులు చేయడం ద్వారా సాక్షాత్తూ దరిద్ర దేవతను మన ఇంటిలోకి ఆహ్వానించినట్లే.ఇక అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజించరో అలాంటి వారికి కూడా సకల దరిద్రాలు చుట్టుకుంటాయని పండితులు చెబుతున్నారు.ఇక అమావాస్య రోజు సాయంత్రం ఎవరు భోజనం చేయకూడదు కేవలం ఫలహారం మాత్రమే తీసుకోవడం మంచిది.

ఈ విధమైనటువంటి పొరపాట్లను చేయకపోవడం వల్ల అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు