Allu Arjun: కథలు పట్టుకొని పుష్ప రాజ్ చుట్టూ తిరుగుతున్న దర్శకులు వీరే !

పుష్ప 2 సినిమా( Pushpa 2 ) తర్వాత అసలు అల్లు అర్జున్( Allu Arjun ) ఏ ప్రాజెక్టు పట్టాలెక్కిస్తాడు ? కథలు ఏమైనా వింటున్నాడా ? ఏ దర్శకుడిని ముందు లైనప్ చేసారు ? హీరోయిన్ ఎవరు ? ఇలా అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనే డైలమా లో ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే హాట్ టాపిక్.

మరి అల్లు అర్జున్ ఎవరి కథ ఒకే చేసాడు ? ఏం సినిమా తీయబోతున్నాడు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నిజానికి అల్లు వారి అబ్బాయి కోసం కథలతో సిద్ధంగా ఉన్న దర్శకుల క్యూ పెద్దగానే ఉంది.

వచ్చే ఏడాది ఆగష్టు లో పుష్ప 2( Pushpa 2 ) విడుదల అవుతుంది.దాంతో నేను అంటే నేను అని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రంగంలోకి దిగిపోతున్నారు.

క్యూ లో ముందు త్రివిక్రమ్( Trivikram ) ఉన్నాడు.అలా వైకుంఠపురం విజయం తర్వాత వీరి కాంబోలో మరొక సినిమా రాబోతుంది.

Advertisement

అయితే ఇది కథ అయితే ఒకే అయ్యింది కానీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందో అనే క్లారిటీ లేదు.

ఇక బోయపాటి( Boyapati Srinu ) కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్.కానీ స్కంద సినిమా పరాజయం ఈ కాంబోపై పడే అవకాశం ఉంది.దాంతో బోయపాటి అల్లు అర్జున్ కాంబినేషన్ రావాల్సిన సినిమా గురించి క్లారిటీ వస్తే తప్ప ముందుకు వెళ్ళదు.

ఇక ముంబై వెళ్లి మరి అట్లీ( Atlee ) చెప్పిన కథ విని వచ్చాడు అల్లు అర్జున్.జవాన్ సినిమాతో బాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ తో కూడా ఒక మంచి సినిమా తీయాలనే ప్లాన్ లో ఉన్నాడట.

ఈ డైరెక్టర్స్ అంత వెయిటింగ్ లిస్ట్ లో ఉండగానే నేను మాత్రమే ఏం తక్కువ అన్నట్టుగా జైలర్ ఫేమ్ నెల్సన్( Nelson Dilip Kumar ) కూడా కథ సిద్ధం చేసి వినిపించారట.అంతే కాదు దీనికి నల్లమలుపు బుజ్జి మరియు గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాతలుగా ఉండబోతున్నారట.త్రివిక్రమ్, బోయపాటి, అట్లీ సినిమాలు అప్పుడప్పుడే ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి నెల్సన్ సినిమాను నెక్స్ట్ లైనప్ చేయడానికి రంగం సిద్ధం అవుతుందట.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ చిత్రాలు పూర్తయ్యాక సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా ఉండే ఛాన్స్ ఉందట.

Advertisement

తాజా వార్తలు