సందీప్ రెడ్డి వంగ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించనున్న అల్లు అర్జున్...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి అల్లు అర్జున్( Allu Arjun ) కు ఉన్న గుర్తింపు వేరే ఏ హీరోకి లేదని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పటికే ఆయన పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకున్నాడు.మరి ఈ విజయంతో పాటుగా ఆయన తర్వాత చేయబోయే సినిమా మీద భారీ ఫోకస్ ను పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.

Allu Arjun To Play Dual Role In Sandeep Reddy Vanga Film Details, Allu Arjun , S

ఇక ఏది ఏమైనా కూడా జాతి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలకు పోటీని ఇస్తున్న ఏకైక హీరో కూడా అల్లు అర్జున్ కావడం విశేషం.1850 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) తో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా కోసం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Arjun To Play Dual Role In Sandeep Reddy Vanga Film Details, Allu Arjun , S
Advertisement
Allu Arjun To Play Dual Role In Sandeep Reddy Vanga Film Details, Allu Arjun , S

హీరో, విలన్ రెండు పాత్రలను తనే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పటివరకు అల్లు అర్జున్ డ్యూయల్ లో రోల్ లో నటించలేదు.కాబట్టి ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకొని తన నటనలో పరిణితిని కూడా సంపాదించుకుంటాడని ప్రతి ఒక్కరు మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు