సాయి ధరమ్ తేజ్ ని ప్రమాదం నుంచి రక్షించింది అల్లు అర్జునా.. ? షాకింగ్ నిజాలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హైదరాబాద్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

మైండ్ స్పేస్ దగ్గరున్న కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.ప్రస్తుతం తను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆయనకు ఆపరేషన్ కూడా నిర్వహించారు వైద్యులు.ప్రస్తుతం ఆయన వైద్యానికి సహకరిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యులు 108కు కాల్ చేశారు.అక్కడి నుంచి దగ్గర్లోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు.

Advertisement
Allu Arjun Helps In Sai Dharam Tej Accident , Sai Dharam Tej, Chirenjeevi, Nagab

అక్కడి డాక్టర్లు వెంటనే అపోలోకు తరలించాని సూచించారు.ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ గోవింద్ క్లియర్ చేశాడు.

ఆస్పత్రికి సకాలంలో వెళ్లేలా ప్రయత్నించాడు.అటు సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం జరిగిన విషయం తొలుత తెలిసింది అల్లు అర్జున్ కు మాత్రమే.

ఆ సమయంలో తను పుష్ప షూటింగ్ లో భాగంగా కాకినాడలో ఉన్నాడు.వెంటనే అక్కడి నుంచి మెగా ఫ్యామిలీని అలర్ట్ చేశాడు.

చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, తన తండ్రి అరవింద్ కు విషయం చెప్పాడట.రాంచరణ్, ఉపాసనతో కోఆర్టినేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సాయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020

ఆయనకు అందుతున్న వైద్యం.ఆయన ఏ కండీషన్ లో ఉన్నాడు అనే విషయాలను వాకబు చేశాడు.

Advertisement

ఆయను చూసేందుకు చిరంజీవి కుటుంబంతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని.ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

కానీ బన్నీ అక్కడ నుంచే వారందరికీ సాయి ఆరోగ్యం గురించి పాజిటివ్ గా చెప్తూ ధైర్యం నింపాడు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అటు సాయి డ్రైవ్ చేసిన బైక్.తనది కాదని తెలుస్తోంది.ఆ బైక్ రిజిస్ట్రేషన్ వేరే వ్యక్తి పేరుతో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.కేబుల్ బ్రిడ్జ్ మీద పేరుకుపోయిన ఇసుక కారణంగా బైక్ స్కిడ్ అయినట్లు సీసీ టీవీ విజువల్స్ లో కనిపిస్తున్నా.

పోలీసులు మాత్రం అతివేగం అంటూ మోటార్ వెహికల్ యాక్ట్ 336, 276,184 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇప్పటికే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

బైక్ ను కూడా హ్యాండోవర్ చేసుకున్నారు.సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.

పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది తెలుస్తుంది.

తాజా వార్తలు