అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను బాగా తిట్టారు... అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా ఈమె పాపులారిటీ సంపాదించుకుంది.

ఒకవైపు జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూనే, మరొక వైపు సినిమాలలో నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.ఇప్పటికే రంగస్థలం సినిమా తో రంగమ్మత్త గా బాగా ఫేమస్ అయిన ఈమె, తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షాయిని పాత్రలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది తగ్గేదేలే లేదు అన్నట్టుగా రాబడుతోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
Allu Arjun Fans Scolded Me A Lot Anasuya Interesting Comments Details, Allu Arj

ఇందులో పలువురు నటీనటులు వారి నటనకు గాను ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్రబృందం.

ఈ క్రమంలోనే అనుసూయ మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈ సినిమాలో అనసూయ దాక్షాయణి అనే క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడదాము అనుకున్నాను.

కానీ తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి ఇంటర్వ్యూలకు రాలేకపోయాను.

Allu Arjun Fans Scolded Me A Lot Anasuya Interesting Comments Details, Allu Arj
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

కానీ బన్నీ గురించి ఈరోజు చెబుతున్నా.బన్నీ నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ మీకు కూడా తెలియదు.మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పాను.

Advertisement

కానీ కొంతమంది దానిని మరోలా అర్థం చేసుకొని నన్ను బాగా తిట్టేశారు.ఈ విషయం మీ దాకా వచ్చినప్పుడు మీరు మంచి మనసుతో ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారు.

మీది చాలా పెద్ద మనసు.అల్లు అర్జున్ కేవలం అబ్బాయిలకు మాత్రమే అమ్మాయిలకు కూడా ఇన్స్పిరేషన్.

పుష్ప సినిమాలో దాక్షాయిని క్యారెక్టర్ లో నన్ను తక్కువగా చూపించారు అని అంటున్నారు.ఇక రెండవ భాగంలో మాత్రం చక్రం తిప్పుతా అని చెప్పుకొచ్చింది అనసూయ.

మొత్తానికి అనసూయ తన ఖాతాలో మరొక సూపర్ హిట్ సినిమాను వేసుకుంది.

తాజా వార్తలు