జానీ మాస్టర్ కు విష్ చేయని బన్నీ ... కావాలనే దూరం పెట్టారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతూ పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే అల్లు అర్జున్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.

మెగా కుటుంబంతో ఈయనకు విభేదాలు ఉన్నాయని అందుకే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు అంటూ తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే తాజాగా మరోసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ( National Award ) జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా మన సౌత్ సినిమాలకు కూడా పెద్ద ఎత్తున జాతీయ అవార్డులు రావడంతో బన్నీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేషనల్ అవార్డు గ్రహీతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీల పేర్లను ప్రస్తావిస్తూ కూడా ఈయన అభినందనలు తెలియజేశారు.

నిత్యామీనన్, రిషబ్ శెట్టితో పాటు హీరో నిఖిల్ డైరెక్టర్ చందు మొండేటి అలాగే కార్తికేయ 2 చిత్ర బృందానికి ఈయన పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.ఇకపోతే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ( Jani Master ) సైతం ఈ నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.ఇక అల్లు అర్జున్ కి కూడా సూపర్ హిట్ సినిమాలకు ఈయన కొరియోగ్రఫీ చేశారు.

Advertisement

అయినప్పటికీ ఎక్కడ కూడా జానీ మాస్టర్ పేరును ప్రస్తావించలేదు అలాగే ఆయనకు ఎలాంటి శుభాకాంక్షలు తెలుపలేదు దీంతో మరోసారి అల్లు అర్జున్ సోషల్ మీడియా వార్తలలో నిలిచారు.

జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే జనసేన పార్టీలోకి చేరటమే కాకుండా ఈయన గత ఎన్నికలలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ తరఫున పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సైతం ఈయనను దూరం పెట్టారని అందుకే తనకు ఎలాంటి విశేష తెలియజేయలేదని తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ స్థాయిలో అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు