ఆ మూవీలో విలన్ గా కనిపించబోతున్న బన్నీ.. బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా!

ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలు కేవలం హీరోల క్యారెక్టర్లలో మాత్రమే కాకుండా నెగటివ్ రూల్స్ లో విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

కొన్ని కొన్ని సార్లు కొంతమంది విలన్ గా నటిస్తూ సర్ప్రైజ్ ఇస్తున్నారు.

అయితే ఇప్పటికే ఆ లిస్టులో జూనియర్ ఎన్టీఆర్, యశ్ వంటి స్టార్స్ చేరిన విషయం తెలిసిందే.ఇప్పుడు అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఆ లిస్టులో చేరబోతున్నాడని తెలుస్తోంది.

ఏంటి అల్లు అర్జున్ విలన్( Villain ) గానా అని ఆశ్చర్యపోతున్నారా! అవునండోయ్ ఇదే వార్త ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను అట్లీ( Atlee ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ మూవీని అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఈ సినిమాకి సంబంధించి రోజుకో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

Advertisement

తాజాగా మరో సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట.

హీరోగా, విలన్ గా రెండు విభిన్న పాత్రల్లో అలరించడానికి సిద్ధమవుతున్నాడట.

అంటే అట్లీ సినిమాలో బన్నీ తనని తానే ఢీ కొట్టబోతున్నాడు అన్నమాట.పుష్పలో అల్లు అర్జున్ పోషించిన పాత్రలో కొన్ని నెగెటివ్ ఛాయలు కనిపిస్తాయి.కానీ, పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్న మొదటి సినిమా ఇదే.పుష్పతో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు హీరోగా, విలన్ గా డ్యూయల్ రోల్ లో కనిపించి నటునిగా ఇంకెన్ని ప్రశంసలు అందుకుంటాడో చూడాలి మరి.కాగా ప్రస్తుతం ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు